Lakshman: అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికి?..
ABN, First Publish Date - 2023-08-11T14:54:12+05:30
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో విపక్షాలు సభలో లేవని.. మరి అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో విపక్షాలు సభలో లేవని.. మరి అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Lakshman) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) తోక పార్టీలుగా బీఆర్ఎస్ (BRS), మజ్లిస్ (Mazlis) కూడా వాక్ ఔట్ (Walk Out) చేయడం చూశామన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి చివరి వరకు లేకుండా పారిపోవడం చరిత్రలో బహుశా ఇదే మొదటిసారని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు బొక్క బోర్ల పడ్డాయని, అభాసుపాలయ్యాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందని, కేసీఆర్ (KCR) కుటుంబ పాలన అంతం చేయడానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యమ్నాయమని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండబెట్టడంతో పాటు, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు అందజేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదా? ఇదే విషయాన్ని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ఇప్పటి వరకు నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బండి సంజయ్ మాట్లాడారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Updated Date - 2023-08-11T14:54:12+05:30 IST