Seethakka: నేను మంత్రి కాకూడదా.. ఎందుకింత హేళన..!? : సీతక్క
ABN, First Publish Date - 2023-11-13T14:04:38+05:30
నన్ను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ములుగులో పోటీ చేస్తోంది నాగజ్యోతి కాదు.. కేసీఆర్(kcr), కేటీఆర్(ktr). దొంగ నోట్లు కూడా పంచుతున్నారు.
హైదరాబాద్ : ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నన్ను ఓడించేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ములుగులో పోటీ చేస్తోంది నాగజ్యోతి కాదు.. కేసీఆర్(kcr), కేటీఆర్(ktr). దొంగ నోట్లు కూడా పంచుతున్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ‘సీతక్క మంత్రి అవుతుందంట’ అంటూ హేళన చేస్తున్నారు. బడుగు బలహీనవర్గాలు మంత్రులు కావద్దా?, ఇంకా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా?, దొరల తెలంగాణ కావాలా..? ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ (Congress) కావాలో ప్రజలే తేల్చుకోవాలి. మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ (BRS) నేతలు మన ఇళ్లల్లోకి వస్తే తిరగబడండి.. తరిమి కొట్టండి’’ అని సీతక్క పిలుపునిచ్చారు.
Updated Date - 2023-11-13T15:10:39+05:30 IST