TS NEWS: నాంపల్లి కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2023-09-20T18:15:27+05:30
నాంపల్లి కోర్టు(Nampally Court)లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్(Mohammed Salimuddin) అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: నాంపల్లి కోర్టు(Nampally Court)లో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాంపల్లి కోర్టు భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్(Mohammed Salimuddin) అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టులో సలీముద్దీన్ను పోలీసులు హాజరుపరిచారు. కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి సలీముద్దీన్ దూకాడు. పై నుంచి దూకడంతో సలీముద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలయిన వ్యక్తిని పోలీసులు ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-09-20T18:15:27+05:30 IST