Nandikanti Sridhar: మేడ్చల్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?
ABN, First Publish Date - 2023-10-02T21:53:54+05:30
మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్(Congress)కు భారీ షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్(Nandikanti Sridhar) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్(Congress)కు భారీ షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్(Nandikanti Sridhar) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ అనూహ్య పరిణామంతో కాంగ్రెస్ నేతలు డైలామాలో పడిపోయారు. తన రాజీనామా లేఖను శ్రీధర్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. రెండ్రోజుల క్రితం శ్రీధర్‌ను ఢిల్లీకి పిలిచి రాహుల్‌గాంధీ బుజ్జగించిన విషయం తెలిసిందే. మైనంపల్లికి టికెట్ ఇవ్వడంతో శ్రీధర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. కాగా.. నందికంటి శ్రీధర్ త్వరలో (BRS)లో చేరనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ తీరు సరిగా లేదు
అల్వాల్ లోని తన నివాసంలో ముఖ్య కార్యకర్తలతో నాయకులతో నందికంటి శ్రీధర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులతో తన ఆవేదనను పంచుకున్నారు. ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న బీసీ నాయకుడికి అన్యాయం చేయడం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి నుంచి ఎగిసే స్థితికి తీసుకువచ్చిన నందికంటి శ్రీధర్‌కు మల్కాజిగిరి టికెట్ కేటాయించకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని నమ్ముకున్న నాయకులను క్యాడర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితి నుంచి అన్ని విధాలా పార్టీకి కట్టుబడితో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులను విస్మరించడం హేయమైన చర్య అని నాయకులు అన్నారు.
Updated Date - 2023-10-02T21:53:54+05:30 IST