ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఆఖరి నిమిషంలో నామినేషన్ వేసిన రేవంత్

ABN, First Publish Date - 2023-11-10T15:34:28+05:30

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్‌లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం

హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్‌లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది. ఈనెల 13న అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

ఇక ఈ నెల 30న 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. ఈసారి టీడీపీ, వైఎస్సాఆర్‌టీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. వైఎస్సాఆర్‌టీపీ మాత్రం అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం నుంచి బరిలోకి దిగింది. సీపీఎం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది.

119 నియోజకవర్గాల్లో రెండు వేల ఐదు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో యాభై, మేడ్చల్‌లో ముప్పై వరకు నామినేషన్లు వేశారు.

118 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు వేశారు. ఒక స్థానం సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. గతంతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు రెబల్ బెడద కూడా తగ్గింది. ఒకటి, రెండు స్థానాలు మినహా ఎక్కడా రెబల్స్ బెడద లేదు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి కాంగ్రెస్ నుంచి సింగిల్ అభ్యర్థులు ఉండే ఛాన్సుంది. ఇక కామారెడ్డి‌లో సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఆఖరి నిమిషంలో రేవంత్‌రెడ్డి దాఖలు చేశారు. ఇక పోలింగ్‌కి మరికొన్ని రోజులే ఉండడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది.

Updated Date - 2023-11-10T15:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising