ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar : గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడమంటే తమను అవమానించడమేనంటూ..

ABN, First Publish Date - 2023-08-07T09:24:07+05:30

ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికలాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్ : ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ ( మావోయిజం ) వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు.

గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని తెలిపారు . ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు. నక్సలిజం సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని శశిధర్ వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను.. ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు.

ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని రావినూతల శశిధర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయన్నారు. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరుతున్నామని శశిధర్ పేర్కొన్నారు. దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం మావోయిజం భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యాంటీ టెర్రరిజం ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-07T09:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising