Hyderabad Lands: కొనసాగుతున్న హెచ్ఎండీఏ భూముల వేలం జోరు
ABN, First Publish Date - 2023-08-08T16:23:02+05:30
హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. షాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తున్నారు. 300 చ.గ. విస్తీర్ణం గల 50 ప్లాట్లను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది.
హైదరాబాద్: హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. షాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తున్నారు. 300 చ.గ. విస్తీర్ణం గల 50 ప్లాట్లను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. మొదటి సెషన్‌లో ఉదయం.11 నుంచి మధ్యాహ్నం.2 గంటల వరకు 25 ప్లాట్లు వేలం వేశారు. రెండో సెషన్ మధ్యాహ్నం.3 నుంచి సాయంత్రం.6 గంటల వరకు మరో 25 ప్లాట్ల వేలం సాగుతోంది. కనీస నిర్దేశిత ధర 10,000 రూపాయల నుంచి వేలం పాట ప్రారంభమైంది. సోమవారం మోకిలలోని ప్లాట్ల వేలంలోనూ సర్కారుకు కాసుల పంట పండింది. అత్యధికంగా చదరపు గజం లక్షా 5 వేల రూపాయల ధర పలికింది. సరాసరి చదరపు గజం రూ.80,397 రూపాయలకు అమ్ముడుపోయాయి. మోకిలలో మొత్తం 50 ప్లాట్లకు 121.40 కోట్ల భారీ ఆదాయాన్ని హెచ్ఎండీఏ అర్జించింది.
Updated Date - 2023-08-08T16:23:02+05:30 IST