ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల నిరసన

ABN, First Publish Date - 2023-10-19T19:35:44+05:30

టీడీపీ అధినేత, ఆంధ్రప్రధేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణలోనూ ఆయన అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రధేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణలోనూ ఆయన అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "న్యాయాన్ని నిర్బంధించ లేరు" పేరుతో విన్నూత రీతిలో ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు అలుముకున్నాయని, పూర్తి మెజారిటీ ఇచ్చింది మెరుగైన పాలన కోసం కానీ.. హత్యారాజకీయాలు, అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదన్నారు. చంద్రబాబు నూతన హైదరాబాద్ నగరానికి పునాధులు వేసి, హైదరాబాద్ కేంద్రంగా ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టి ఉపాధి కల్పన కోసం బాటలు వేసిన బాటసారి అని గుర్తు చేశారు. ఆయన దూర దృష్టితోనే హైదరాబాద్ ఆర్ధిక, ఉపాధి రాజధానిగా విలసిల్లుతోందన్నారు. ఇక్కడ పెట్టుబడుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాలకులను ఒప్పించి, మెప్పించిన పరిపాలనా దక్షుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య, వయస్సు రీత్యా రాష్ట్రపతి ఆయనను విడుదల చేసేందుకు చొరవ చూపాలని తలారి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ఎన్నో రోజులు వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకోలేరని "ఆర్ధిక నేరస్తులే - అభివృద్ధి ప్రధాతకు దోషిగా " చిత్రీకరిస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. లోకేష్ నేడు తాత, తండ్రి మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో పరిణితి చెందారని తలారి శ్రీనివాసరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ నేత బండి మురళీ కృష్ణ, తెలంగాణ క్రీడా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి సతీష్ గౌడ్, ఎల్ ఎస్ ఓ అధ్యక్షుడు అశోక్ నాయక్, నరేందర్ రాథోడ్, ఎస్సీ సెల్ నేత చప్పిడి గోపయ్య, టి.నాగరాజు, విష్ణు పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, చంద్రబాబు అభిమానులు ప్రవీణ్, రాము పాల్గొన్నారు.

Updated Date - 2023-10-19T19:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising