PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:44 PM
Telangana: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే (Telangana Congress in-charge Thackeray) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు.
అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Utham kumar Reddy), కన్వీనర్ షబ్బీర్ అలీ (Shabbir Ali), వి. హనుమంతరావు (V. Hanumanth Rao) తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ఐదు అంశాల ఎజెండాగా...
1. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పీఏసీ
2. తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన పీఏసీ
3. 6 గ్యారంటీల అమలుపై చర్చ
4. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించిన పీఏసీ
5. సోనియా గాంధీని ఎంపీగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన పీఏసీ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 18 , 2023 | 03:58 PM