ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KA Paul: కోమటిరెడ్డి ఎవరో నాకు తెలియదు

ABN, First Publish Date - 2023-02-14T15:31:22+05:30

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌లో మూడు లక్షల ఓట్లు ఉంటే, మూడు వేల ఓట్లు పడ్డాయన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టు అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలుసన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కడ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తూర్చుకపోయిందని.. అందుకే జాతీయ పార్టీ పెట్టారన్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు, ఆయా కులాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. తాను బీసీని అని... దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. 90 శాతం ప్రజలు తనకు సపోర్ట్‌గా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ పుట్టినరోజునే సెక్రటేరియట్ ప్రారంభించాలని పాల్ డిమాండ్ చేశారు.

మరోవైపు... తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ (Telangana)లో హంగ్ అసెంబ్లీ (Hung Assembly) వస్తుందని జోస్యం చెప్పారు. తమతో కలవాల్సిందే కాబట్టి సీఎం కేసీఆర్‌ (CM KCR) కాంగ్రెస్‌ను పొగుడుతూ.. బీజేపీ (BJP)ని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో తాము చెప్పామని, దేశానికి చాలా చేసిందని అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు (Senior Leaders) అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-14T15:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising