ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul: నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

ABN, First Publish Date - 2023-11-28T08:16:21+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

ఈ ఉదయం రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. 10 గంటలకు జూబ్లీహిల్స్, 12 గంటలకు నాంపల్లి, 2 గంటలకు మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే ప్రియాంక గాంధీ జహీరాబాద్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి, మల్కాజ్‌గిరిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలో రోడ్ షో, 11 గంటలకు దోమకొండలో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజ్‌గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రోడ్ షోలో పాల్గొంటారు. కాగా ఈ రోజు ఉదయం 11.30 గంటలకు గాంధీభవన్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెల్హాట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Updated Date - 2023-11-28T08:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising