ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BSP Manifesto: బీఎస్పీ మేనిఫెస్టో-2023 విడుదల

ABN, First Publish Date - 2023-10-17T15:43:31+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు బీఎస్పీ పార్టీ ( BSP party ) సమాయత్తం అవుతోంది. ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచింది. ప్రణాళికలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లిలో బీఎస్పీ సమావేశం నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) బహుజన భరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023 ను విడుదల చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు బీఎస్పీ పార్టీ ( BSP party ) సమాయత్తం అవుతోంది. ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచింది. ప్రణాళికలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లిలో బీఎస్పీ సమావేశం నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) బహుజన భరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023 ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మహత్య విషయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు, ఆమె క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఆమె పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేదని, ప్రిపేరే కాలేదని మాట్లాడడం మంత్రి కేటీఆర్ అవివేకం. సామాజిక మాధ్యమాల్లో ప్రవళిక పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న హాల్ టికెట్లు, దరఖాస్తులు కేటీఆర్‌కు కనిపించడం లేదా.. అబద్ధాలు ఆడే విషయంలో తండ్రిని మించిన తనయుడు కేటీఆర్. బాపు ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్ చోర్. 1.45 లక్షల మంది నిరుద్యోగుల బతుకులతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.తెలంగాణ ప్రజలకు బీఎస్పీ 10 ప్రధాన హామీలు ఇస్తోంది.

బీఎస్పీ ప్రధాన హామీలు ఇవే..

1. కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు)

2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక  ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. Data, AI, మరియు కోడింగ్‌లో శిక్షణ

3. బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు మరియు రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, మరియు డ్రైవింగ్ శిక్షణ.

అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. లక్ష

5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం మరియు ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య మరియు జీవిత బీమా

7. నూరేళ్ల ఆరోగ్య ధీమా:  ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌ కేటాయింపు

8. వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి గిగ్ కార్మికులు, లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.

9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.

Updated Date - 2023-10-17T15:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising