ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth: బండి సంజయ్.. కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు..

ABN, First Publish Date - 2023-06-22T15:31:18+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కామెంట్స్ చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఎడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ (Bandi Sanjay)పై కామెంట్స్ చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఎడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బండి సంజయ్.. కేఏ పాల్ (KA Paul) లాగే మాట్లాడుతున్నారని, ఆయనపై సానుభూతి వ్యక్త పరచడం తప్ప సంజయ్ మాటలను సీరియస్‌గా తీసుకోలేమని రేవంత్ అన్నారు.

దశాబ్ది దగా నిరసనలు తెలువుతున్న కాంగ్రెస్ నాయకులను (Congress Leaders) అరెస్ట్ చేయడం దుర్మార్గమని, పోలీసులతో సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీ (Shabbir Ali)ని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. అమరుల బలిదానాలను కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు. ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని రాసి సరిపెట్టారని, శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పెరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.

రూ. 63 కోట్లతో మొదలైన అమరుల స్మారకం అంచనా 179 కోట్ల 5లక్షలకు చేరిందని రేవంత్ అన్నారు. దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలని, ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య... వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలన్నారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని విమర్శించారు. అమరుల స్మారక నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని, ఎలివేషన్‌లో ఉపయోగించింది స్టెయిన్ లెస్ స్టీల్.. 4ఎంఎం పలుచని స్టెయిన్ లెస్ స్టీల్ వాడారన్నారు. నగరం నడిబొడ్డున అమరుల స్మారకంలో వాడిన స్టెయిన్ లెస్ స్టీల్ 8ఎంఎం అంచనా వేసి 4ఎంఎం వాడారని, ఈ మొత్తం అవినీతికి కారణం కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1569 మంది అమరుల పేర్లు శిలాశాసనంలో పొందుపరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి రూ.25 వేలు నెలకు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న 1569 మంది కుటుంబాలను పిలిచి సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనాలు చేయిస్తామని, తెలంగాణ సాధన సమరయోధులుగా వారికి గుర్తింపు అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-22T15:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising