ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: సీఎం కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు

ABN, First Publish Date - 2023-08-21T16:56:43+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల ప్రకటనపై స్పందించిన ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పు చేసి కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారన్నారు. గజ్వేల్‌లో ఓడిపోతానని భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని.. కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో ఓడించి తీరుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారని.. కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

50 ఎండ్లలో కాంగ్రెస్ (Congress) ఏం చేసిందని అడగడానికి సీఎం కేసీఆర్‌కు సిగ్గు ఉండాలని, రెండు అవకాశాలు ఇస్తే ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమం చేయడం.. కాకపోతే కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని నిలబెట్టారని అన్నారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతి నిర్ణయంలో కేసీఆర్ ఉన్నారని, అప్పుడు జరిగింది పాపమే అయితే... ఆ పాపంలో ఆయనకు భాగం ఉన్నట్టే కదా.. ఆనాటి పాపాలకు కేసీఆర్ పాపాల భైరవుడని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసిందేనని, 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకి సిద్దమా? అని సవాల్ విసిరారు. 2014 నుండి 2023 వరకు రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్‌తో సీఎం కేసీఆర్ ఏం చేశారో చర్చకు సిద్దమా? అన్నారు.

ఉచిత విద్యుత్, పెన్షన్ లాంటి ఆలోచన చేసింది.. ఇచ్చింది కాంగ్రెస్ అని, కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో.. ఏం చేయలేదో దీనిపై చర్చకి సీఎం కేసీఆర్ సిద్దమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తన తల్లితండ్రుల పేర్లు తప్పా మిగితావన్నీ అబద్ధాలే చెప్తారన్నారు. ‘కేసీఆర్ తన భవన్ గోడలపై రాసుకో... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నాలుగువేల పెన్షన్ ఇస్తాం.. కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతాం’ అని అన్నారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా... పది రోజులకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని.. ప్రజలు నీళ్లలో మునిగి చనిపోయారు.. కేటీఆర్ (KTR) వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 119 అభ్యర్థులతో పైసలు, మందు పంచమని ఓట్టు వేపిస్తా, మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. యాదాద్రికి రమ్మంటారా?.. నాంపల్లి దర్గాకి రమ్మంటారా?.. మెదక్ చర్చికి వెళ్దామా? అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేయమన్నా మేం సిద్ధమే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-21T16:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising