ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలి.. డీజీపీకి రేవంత్ ఫిర్యాదు...

ABN, First Publish Date - 2023-02-09T14:54:47+05:30

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు (MLA Purchase) వ్యవహారంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నుంచి టీఆర్ఎస్‌ (TRS)లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర డీజీపీ (DGP)కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టు (High Court)లో ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కేసు నెంబర్ 455లో తమ ఫిర్యాదును కూడా జత చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో ఎన్నికలు జరిగాక మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని తెలిపారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రకాల లబ్ది చేకూర్చిందని చెప్పారు. 12 మంది ఎమ్మెల్యేలు నేరాలకు అలవాటు పడ్డ వారుగా గుర్తింపు పొందారని, 12 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి మారెందుకు జరిగిన వ్యవహారంలో కూడా ఉన్నారన్నారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసును సీబీఐకి ఇస్తున్న నేపథ్యంలో 12 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాలను కూడా జత చేసి సీబీఐకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

Updated Date - 2023-02-09T14:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising