ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth: దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు

ABN, First Publish Date - 2023-09-05T18:17:30+05:30

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో (Country Politics) పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మన విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూసీ (CWC) సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ (BJP) ప్రమాదం అంచున నెట్టేసిందని విమర్శించారు. మనమంతా 16, 17, 18 ఈ మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. బుధవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్ (KC Venugopal) వచ్చి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. 17వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌ (Parade Ground)లో 10 లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహిద్దామన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు.

ఈ సభ ద్వారా కాంగ్రెస్ (Congress) దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని, పరేడ్ గ్రౌండ్‌లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్ 2న డిఫెన్స్ వారికి లేఖ ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెడతామంటూ కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసి ఈ కుట్రను తిప్పికొట్టాలన్నారు. ప్రభత్వమే కుట్రదారుగా మారడం దారుణమన్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయినా బీఆర్ఎస్ (BRS), బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదని, ఔటర్ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలన్నారు. 17న సోనియా గాంధీ ఇచ్చే 5 గ్యారంటీలను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-05T18:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising