Revanth Reddy: కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు..
ABN, First Publish Date - 2023-08-01T14:27:36+05:30
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని అధికారిక లెక్కల ప్రకారం వరదల్లో 40 మంది చనిపోయారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని అధికారిక లెక్కల ప్రకారం వరదల్లో 40 మంది చనిపోయారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, వరదల వల్ల రూ. 5 వేల కోట్ల నష్టం సంభవించిందన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని (Akhilapaksham) తీసుకుని ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రిని కలిసి నిధులు విడుదల చేయమని అడగాలని సూచించారు.
బీఆర్ఎస్ ఎంపీ (BRS MPs)లు ఎందుకు పార్లమెంట్‌కు వస్తున్నారో తెలియడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని, పంటలు నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందంటూనే రూ. 500 కోట్లు కేటాయించారని, వరదలతో రైతులు నష్ట పోతే కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన సందర్భం ఇదా? మానవత్వం ఉన్నవారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయాలు చేస్తున్నారని విర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా సిగ్గులేకుండా మహారాష్ట్రకు వెళ్లి పార్టీ ఫిరాయించిన వారికి కండువా కప్పుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. కేంద్రం తెలంగాణను ఆదుకోకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేసీ వరద సహాయం సాధిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2023-08-01T14:27:36+05:30 IST