TSPSC అంశంపై రాష్ట్రపతికి లేఖ రాసిన ఆర్ఎస్ ప్రవీణ్
ABN, First Publish Date - 2023-04-03T11:04:19+05:30
TSPSC అంశంపై భారత రాష్ట్రపతికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(
హైదరాబాద్: TSPSC అంశంపై భారత రాష్ట్రపతికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సోమవారం లేఖ రాశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Telangana Public Service Commission) పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరపించాలని లేఖలో పేర్కొన్నారు. లీకేజీ వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఏమిటో తేల్చాలని, ప్రస్తుత కమీషన్‌ను భర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని ప్రవీణ్ కుమార్ లేఖలో కోరారు.
CRDA: ఆగమేఘాల మీద సీఆర్డీఏ ఫైల్స్..కాసేపట్లో సీఎం జగన్‌తో సీఆర్డీఏ అథారిటీ భేటీ
కాగా, టీఎస్పీఎస్సీ (TSPSC) నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్ లీక్‌లో(AE Paper Leak) కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మూడు ఏఈ పేపర్లను రూ. 40 లక్షలకు రాజేశ్వర్ అమ్మినట్లు సమాచారం. రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న తర్వాత మిగతా డబ్బులు..పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజేశ్వర్ దగ్గర నుంచి పోలీసులు రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. ఇక రేణుకకి పేపర్ లీక్ చేసిన ప్రవీణ్..నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. రూ.10 లక్షలకు రేణుకతో బేరం చేసుకున్నాక..అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ప్రవీణ్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని సమీప బంధువు రాజేశ్వర్‌కి రేణుక భర్త డాఖ్యా నాయక్ చెప్పాడు. దీంతో మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించిన రాజేశ్వర్.. అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.23 లక్షల్లో రూ.10 లక్షలు డాఖ్యా నాయక్‌కు ఇచ్చినట్లు తెలిసింది.
Updated Date - 2023-04-03T11:25:47+05:30 IST