ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News : పోలీసుల అదుపులో ఉన్న సెక్యూరిటీ గార్డుకి ఏమైందోఏమో కానీ ఒక్కసారిగా అపస్మార స్థితిలోకి వెళ్లి.. ఆపై..

ABN, First Publish Date - 2023-07-17T10:27:02+05:30

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికే మరణించాడు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహారుకు చెందిన నితీశ్ (32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికే మరణించాడు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం.. నానక్‌రాంగూడలోని ఓ లేబర్ క్యాంపులో బిహారుకు చెందిన నితీశ్ (32), బిట్టు, వికాస్‌లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. నిన్న క్యాంపులోని కూలీలు రాత్రి 11 గంటలకు బయటకు వెళ్లేందుకు యత్నించారు. సెక్యూరిటీలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. దీంతో కూలీలు డయల్100కు కాల్ చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ వ్యవహారంలో విచారించేందుకు సెక్యూరిటీ గార్డులు ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే వీరిలో నితీశ్ అనే సెక్యూరిటీ గార్డు ఆదివారం ఉదయం 7.55 గంటల సమయంలో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లాడు. అది గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారని.. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు.కొద్దిసేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని వైద్యులు చెప్పారని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.

Updated Date - 2023-07-17T10:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising