ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sejal: ఆరు నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోరా?.. దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆవేదన

ABN, First Publish Date - 2023-08-04T13:45:34+05:30

న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

న్యూఢిల్లీ: న్యాయం కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS Durgam Chinnaiah) బాధితురాలు శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులను కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు శేజల్ తెలిపారు. దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే అన్యాయం చేశాడంటూ గత ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పట్టించుకోవడం లేదని బాధితురాలు విమర్శించారు.


మణిపూర్‌లో బాధిత మహిళల కోసం గొంతెత్తుతున్న బీఆర్‌ఎస్ ఎంపీలు (BRS MPs) సొంత రాష్ట్రంలో సొంతపార్టీ ఎమ్మెల్యేను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. గత ఆరు రోజులుగా పార్లమెంటు ఎదుట నిరసన తెలుపుతున్నప్పటికీ తెలంగాణ ఎంపీలు పట్టించుకోవడం లేదన్నారు. ‘‘మణిపూర్ మహిళలకే హక్కులున్నాయా? నేను మహిళను కాదా? నాకు హక్కులు లేవా?. నేను శాంతియుతంగా నా పోరాటాన్ని కొనసాగిస్తుంటే పోలీసులను అడ్డుకుంటున్నారు. వెంటనే చిన్న దుర్గయ్య మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ అడిగిన ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. త్వరలో వాటి వివరాలు బయట పెడతా. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తా’’ అంటూ శేజల్ స్పష్టం చేశారు.


కాగా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించారని ఆరోపిస్తూ గతంలో రెండు సార్లు శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మొదట ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో విషం తాగి సూసైడ్ అటెమ్ట్ చేయగా.. మరోసారి హైదరాబాద్‌లో మాదాపూర్‌లో నిద్రమాత్రు మింగి బలవన్మరణానికి యత్నించారు. అయితే రెండు సార్లు శేజల్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-08-04T13:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising