Data Theft Case: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో తెరపైకి సంచలన విషయాలు
ABN, First Publish Date - 2023-03-28T15:01:26+05:30
వ్యక్తిగత డేటా (Data) అంగట్లో సరుకులా మారిపోయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) నిఘాలో తెరపైకి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో డేటా చౌర్యం దందా బట్టబయలైంది. దాదాపు
హైదరాబాద్: వ్యక్తిగత డేటా (Data) అంగట్లో సరుకులా మారిపోయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) నిఘాలో తెరపైకి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో డేటా చౌర్యం దందా బట్టబయలైంది. దాదాపు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ అయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు డేటా బేస్ కంపెనీలకు ఫోన్ చేయడంతో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ డేటా కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తామంటూ డేటా బేస్ ప్రతినిధులు ఆఫర్ చేశారు. డేటాను డైరెక్ట్‌గా మెయిల్‌కే పంపిస్తామంటూ వెల్లడించారు. లక్ష మంది డేటాకు మూడు వేలు.. యాభై వేల మంది డేటాకు రెండు వేలు.. కేవలం మూడు, నాలుగు పైసలకే ఒక డేటా అమ్ముతామంటూ బేరం పెట్టారు. అంటే ఏ రేంజ్‌లో డేటా చౌర్యం జరిగిందో తెలుస్తోంది. జాతీయ భద్రతకే ముప్పుగా మారడంతో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే డేటా చోరీ కేసు (Data Theft Case)లో సైబరాబాద్ సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. డేటా చోరీ కేసును మూడు కేటగిరీలుగా విభజించింది. రక్షణ ఉద్యోగులు, పౌరుల వ్యక్తిగత డేటాతో పాటు సంస్థల డేటా చోరీపై సైబరాబాద్ సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
Updated Date - 2023-03-28T15:01:26+05:30 IST