ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shridhar Babu: మార్పుకోసం ఒక్క అడుగు వేయండి

ABN, First Publish Date - 2023-09-12T21:45:47+05:30

తెలంగాణలో మార్పుకోసం ఒక్క అడుగు వేయాలని పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో‌(Congress Party Manifesto)పై సమావేశం అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణలో మార్పుకోసం ఒక్క అడుగు వేయాలని పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో‌(Congress Party Manifesto)పై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేనిఫెస్టో ఏవిధంగా ఉండాలి అనే అంశంపై కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలిపారు.పలు విషయాలపై సీనియర్ నేతలు సలహాలు, సూచనలు చేశారు. వాగ్దానాలకే పరిమితం కాకుండా మేనిఫెస్టో ఉండాలని భావించాం. సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ ఆకాంక్ష నెరవేరడం లేదు. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మేనిఫెస్టో‌లో ఉంటుంది.అన్ని వర్గాల ప్రజలందరినీ కోరుతున్నాం. మీ ఆలోచనను మాకు తెలియజేయండి. రండి.. మీ సలహా సూచనలు ఇవ్వండి. ఎన్నికల సమయంలో డిక్లరేషన్లతో కలిపి ప్రజలు ఇచ్చిన సూచనలను మేనిఫెస్టోలో చేర్చుతాం. ఐదు గ్యారంటీ హామీలు కూడా ఉంటాయి. ఇవి మేనిఫెస్టోలో భాగమే. రేపు కూడా మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహిస్తాం.గాంధీ భవన్‌లో కంట్రోల్ రూల్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తాం. శాస్త్రీయ పద్దతిలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-12T21:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising