ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs Case: ఎస్ఐ కస్టడీ విచారణలో పలు కీలకాంశాలు..

ABN, First Publish Date - 2023-09-07T16:44:57+05:30

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పలు కీలకాంశాలు రాబట్టారు. ఆరు నెలలుగా ముంబైలో పట్టుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో నిలువ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: డ్రగ్స్ కేసు (Drugs Case)లో ఎస్ఐ రాజేందర్‌ను (SI Rajendar) రాయదుర్గం పోలీసులు రెండో రోజు గురువారం కస్టడీ (Custody)లోకి తీసుకుని విచారించారు. పలు కీలకాంశాలు రాబట్టారు. ఆరు నెలలుగా ముంబైలో పట్టుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో నిలువ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన నైజేరియిన్ నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎస్ఐ తన ఇంటికి తరలించినట్లు ఒప్పుకున్నాడు. రాజేందర్‌ వాట్సాప్ కాల్ డాటాపై రాయదుర్గం పోలీసులు విచారించారు. ఒక కిలో 7వందల గ్రాముల డ్రగ్స్‌ను ఎస్ఐ తన ఇంటికి తరలించినట్లు గుర్తించారు. అందులో 250 గ్రాముల డ్రగ్స్ మిస్సింగ్ అయింది. ఎస్ఐ వాట్సప్ కాల్స్, నైజేరియన్‌తో సంబంధాలు, మిస్ అయిన 250 గ్రాముల డ్రగ్స్‌పై రాయదుర్గం పోలీసులు విచారించారు. కస్టడీ పూర్తి కావడంతో రాజేంద్రను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

కాగా డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్‌ను విచారణ నిమిత్తం కూకట్‌పల్లి కోర్టు (Kukatpalli Court) రెండు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో రాయదుర్గం పోలీసులు బుధవారం రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. రెండో రోజు గురువారం సాయంత్రంతో కస్టడీ ముగిసింది.

సైబరాబాద్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేందర్ గత ఫిబ్రవరి నెలలో ముంబైయికి వెళ్లిన సమయంలో నైజేరియన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. నైజేరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కిలో 7వందల గ్రాముల డ్రగ్స్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఎస్ఐ తన ఇంట్లో పెట్టుకుని దాన్ని విక్రయించే ప్రయత్నం చేశాడు. దీంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు వలపన్ని ఎస్ఐను అరెస్టు చేశారు. కాగా ఇప్పటికే ఎస్ఐ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ స్టీఫెన్ రవీంధ్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-07T16:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising