ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీంలో చుక్కెదురు

ABN, First Publish Date - 2023-03-13T15:10:48+05:30

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరీశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలాంటి పేపర్లు, డాక్యుమెంట్స్ సీబీఐకి ఇవ్వొద్దని ఉన్నతన్యాయస్థానం తెలిపింది. ఇప్పుడు విచారణ కొనసాగించవద్దని... చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లు పేర్కొంది. విషయం తమ వద్ద ఉన్నప్పుడు విచారణ కొనసాగించవద్దన్న సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. లేకుంటే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించింది.

సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని పేర్కొంది. అప్పటివరకు యధాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పజెప్పారా అని తెలంగాణ న్యాయవాదులను ప్రశించగా.. లేదని చెప్పిన న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా రెండు విషయాలపై విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్, హైకోర్టులోనే అప్పీల్‌కు వెళ్లడం.. ఈ రెండు అంశాలపై వాదనలు వింటామని తెలిపింది. అప్పటివరకు కేసు దర్యాప్తులో యధాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా దర్యాప్తు జరపకూడదన్నది ప్రాధమిక సూత్రమని న్యాయమూర్తి ఖన్నా తెలిపారు.

మిస్‌లీనియస్ పిటిషన్లు లేని రోజు విచారణ చేపడతామని వెల్లడించింది. మెరిట్స్ ఆధారంగా ఈ అప్పీల్ విచారణార్హమా కాదా అన్నది ముందు తేల్చాలని పేర్కొంది. ఇందుకు చాలా సమయం పడుతుందని.. అందుకే కేసును జులైకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కేసు విచారణ సీబీఐకి బదిలీ అవ్వలేదని బీజేపీ తరఫు న్యాయవాది తెలిపారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని కోర్టుకు చెప్పారు. అయితే సీబీఐ విచారణపై 'స్టే' ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Updated Date - 2023-03-13T15:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising