ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandra Babu Vijayasai Reddy: చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నంతసేపూ పక్కనే విజయసాయి

ABN, First Publish Date - 2023-02-19T13:07:50+05:30

సినీ నటుడు తారకరత్న (Tarakaratna) నివాసానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆయన భౌతికకాయానికి పుష్ప గుచ్ఛములుంచి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సినీ నటుడు తారకరత్న (Tarakaratna) నివాసానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆయన భౌతికకాయానికి పుష్ప గుచ్ఛములుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని అన్నారు. ఆస్పత్రిలో కోలుకుని వస్తారని ఆశించామని, 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి.. చివరికి మాకు దూరమై కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో తారకరత్న తనదైన మార్క్‌ సృష్టించారని

కొనియాడారు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నంతసేపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పక్కనే నిలుచున్నారు.

జనవరి 27న నారా లోకేష్ (Nara Lokesh) పాటు తారకరత్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో పాల్గొన్నారని.. ఒక్కసారిగా కిందపడిపోవడంతో వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి (Narayana Hrudayalaya Hospital)కి తరలించామని చంద్రబాబు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. సమాజానికి ఏదో చేయాలని తపించిన వ్యక్తి తారకరత్న అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తారకరత్నది చిన్నవయస్సు అని, ఫిబ్రవరి 22కు 40 ఏళ్లు వస్తాయని, ఇంత చిన్న వయసులో తారకరత్న చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబానికి అందరం అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని చంద్రబాబు అన్నారు.

కాగా శనివారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తారకరత్న మృతదేహన్ని తరలించారు. హైదరాబాద్‌, మోకిలలోని నివాసానికి తీసుకువచ్చారు. అభిమానుల సందర్శనార్థం రేపు (సోమవారం) తెలుగు ఫిలిం చాంబర్‌లో తారకరత్న పార్ధివదేహాన్ని ఉంచుతారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో తారకరత్న భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.

Updated Date - 2023-02-19T13:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising