Telangana Assembly: బడ్జెట్‌పై సాధారణ చర్చ మొదలు....
ABN, First Publish Date - 2023-02-08T10:53:13+05:30
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Assembly Session) సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే దివంగత మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి (Mandadi Satyanarayana Reddy), జగపతిరావు (Jagatirao), రుద్రమదేవి (Rudramadevi)మృతి పట్ల సభ సంతాపం తెలియజేసింది. వారు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) సభ ముందుకు తీసుకువచ్చారు. మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Prof. Jayashankar Agricultural University) చట్ట సవరణ బిల్లును మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హోమ్ సైన్స్ కోర్స్ పేరును కమ్యూనిటీ సైన్స్‌గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎస్సీ అగ్రకల్చర్, హార్టికల్చర్ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అధికారం యూనివర్సిటీకి ఇస్తూ చట్ట సవరణ చేసింది. కొత్తగా వనపర్తి, కరీంనగర్‌లలో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపై సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు ఇచ్చిన పలు వాయిదా ప్రతిపాదనలను స్పీకర్ తిరస్కరించారు. తర్వాత 2023- 24 బడ్జెట్‌పై సాధారణ చర్చను మొదలు పెట్టాల్సిందిగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (MLA Akbaruddin Owaisi)ని స్పీకర్ కోరారు.
బడ్జెట్‌పై అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగం...
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదన్నారు. కేంద్ర నిధుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రానికి మూడింట ఒక వంతు నిధులు మాత్రమే వస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గుతోందని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ప్రస్తుతం బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది.
Updated Date - 2023-02-08T11:01:09+05:30 IST