TS BJP: 14 కమిటీలు నియమించిన బీజేపీ.. అసంతృప్తులకు చోటు
ABN, First Publish Date - 2023-10-05T14:04:44+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపో.. ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) దగ్గర పడ్డాయి. రేపో.. ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించేశారు. అలాగే తెలంగాణ మంత్రులు కూడా బిజిబిజీగా తిరిగేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇలా అన్ని పార్టీల నేతలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
తెలంగాణ బీజేపీ (BJP) కూడా కదనరంగంలోకి దిగేసింది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం 14 కమిటీలను బీజేపీ నియమించింది.
కమిటీలు ఇలా..
పబ్లిక్ మీటింగ్స్ కమిటీ కన్వీనర్‌గా బండి సంజయ్
సోషల్ మీడియా కన్వీనర్ గా ఎంపీ ధర్మపురి అర్వింద్
సోషల్ ఔట్రీచ్ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ లక్ష్మణ్
మీడియా కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే రఘునందనరావు
చార్జ్‌షీట్ కమిటీ కన్వీనర్‌గా మురళీదరరావు
మ్యానిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ వివేక్
స్ర్కీనింగ్ కమిటీ కన్వీనర్‌గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
ఆందోళనల కమిటీ కన్వీనర్‌గా విజయశాంతి
Updated Date - 2023-10-05T14:04:44+05:30 IST