Ramulu Naik: ఆర్టీసీ కార్మికులు.. కేసీఆర్ కుట్రలకు బలి కావొద్దు
ABN, First Publish Date - 2023-08-02T16:03:46+05:30
ఆర్టీపీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కుట్రలకు బలి కావొద్దని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ (Ramulu Naik) విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్టీపీపై కేసీఆర్‌ది (CM Kcr) ఎన్నికల కపట ప్రేమ. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు. విలీనం డిమాండ్ అసంబద్ధమైనది అని కేసీఆర్ చెప్పారు. విలీనం డిమాండ్ చేసే రాజకీయ పార్టీలకు ఏం తెలియదు అని మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికల కోసం యూ టర్న్ తీసుకున్నారు. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటే 38 మంది కార్మికులు చనిపోయేవారా?, ఆర్టీసీ బకాయిలపై కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు. ఆర్టీసీ విలీన ప్రకటన వెనుక ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర ఉంది. కేసీఆర్ విలీనం ప్రకటనతో కార్మికులు పాలాభిషేకం చేయలేదు. కేవలం స్థానిక ఎమ్మెల్యేలు హడావిడి చేశారు. సబ్ కమిటీలో కార్మికులకు ఎందుకు స్థానం కల్పించలేదు. సమ్మె విరమించిన సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదు. డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ ఎందుకు ఎత్తేయడం లేదు. ఆర్టీసీ విలీనంపై 2018 మేనిఫెస్టోలో పెట్టాం.’’ అని రాములు నాయక్ గుర్తుచేశారు.
Updated Date - 2023-08-02T16:03:46+05:30 IST