T Congress: ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
ABN, First Publish Date - 2023-09-21T16:54:20+05:30
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సమావేశానికి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క. జిగ్నేష్ మేహావని, బాబా సిద్ధిక్ హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరించింది. దీంతో భారీగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఫస్ట్ విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తొలి లిస్ట్‌ను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం హైకమాండ్ ముందు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మొత్తం 300 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి ఎవర్ని అదృష్టం వరిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
Updated Date - 2023-09-21T16:55:59+05:30 IST