కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Governor Tamlisai: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-01T15:17:18+05:30

తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.

Governor Tamlisai: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai Sounderrajan), రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు గాను.. మూడింటికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును తిరస్కరించారు. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి ప్రభుత్వానికి పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు - బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను. బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం కావాలని నన్ను బాదునాం చేస్తే నేను బాధ్యురాలని కాను. నేను రాజకీయమైన యాక్టింగ్ చేయడం లేదు.. నేను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం’’ అంటూ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు.


వారిని చూస్తుంటే బాధేస్తోంది...

అకాల వర్షాలపై గవర్నర్ మాట్లాడుతూ... అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రజల ఇబ్బందులు బాధ కలిగించాయన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాదేస్తోందన్నారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది అని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని, రిమోట్ ఏరియా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు మెమోరాండం ఇచ్చాయన్నారు. హైదరాబాద్ జల్పల్లి ఏరియా వర్షాలు వల్ల ఎఫెక్ట్ అయిందన్నారు. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆదేశించారు. వర్షాలపై ప్రభుత్వాన్ని నివేదిక అడిగానని.. అది వచ్చిన వెంటనే కేంద్రానికి పంపుతానని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో త్వరలో పర్యటించనున్నట్లు గవర్నర్ తమిళిసై ప్రకటించారు.

Updated Date - 2023-08-01T15:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising