Patnam Mahender reddy: భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి...
ABN, First Publish Date - 2023-09-05T10:44:50+05:30
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సూచించారు.
రంగారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Telangan Heavy Rains) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (Minister Patnam Mahender Reddy) సూచించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులను ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రారాదని తెలిపారు. వాగులు, వంకలు నీటితో నిండి పొర్లుతున్నందున రైతులు పొలాల్లోకి అవసరమైతే తప్ప వెళ్ళరాదని కోరారు. కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దని చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్‌తో పాటు అధికారులందరూ స్థానికంగా ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైరల్ ఫీవర్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాల్లో దోమలు చేరకుండా ఉండేందుకు డ్రైనేజీ వాటర్ నిలవకుండా చూసుకోవాలని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సూచనలు చేశారు.
Updated Date - 2023-09-05T10:44:50+05:30 IST