TS Ministers: రేవంత్‌తో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రుల జాబితా విడుదల
ABN, First Publish Date - 2023-12-07T10:20:27+05:30
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 1 గంటకు ఎల్బీస్టేడియంలో రేవంత్ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 1 గంటకు ఎల్బీస్టేడియంలో రేవంత్ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య (Karnataka CM Siddaramaiah) పాల్గొననున్నారు.
రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే తెలంగాణ మంత్రుల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు అందజేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తెలంగాణకు ఒకే ఒక ఉపముఖ్యమంత్రి ఉండనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే..
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)
కొండా సురేఖ (Konda Surekha)
జూపల్లి కృష్ణా రావు (Jupalli Krishna Rao)
భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)
ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)
పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)
సీతక్క (Sithakka)
శ్రీధర్ బాబు (Shridhar Babu)
తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)
పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)
దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)
కాసేపట్లో వీరంతా రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Updated Date - 2023-12-07T12:30:52+05:30 IST