ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: విద్యాశాఖ మంత్రిపై బీజేపీ నేత విమర్శలు

ABN, First Publish Date - 2023-04-04T21:15:17+05:30

చదువురాని చదువుల తల్లి మన విద్యాశాఖ మంత్రి అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) విమర్శించారు.

హైదరాబాద్: చదువురాని చదువుల తల్లి మన విద్యాశాఖ మంత్రి అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) విమర్శించారు. పేపర్ లీకేజ్‌లో సిట్ మాల్యాలకు ఎందుకు వెళ్ళి విచారిస్తున్నారని, అది సిట్టా.... ఐన్వెస్టిగేషన్ ఎట్ హోమా అని మండిపడ్డారు. మిగతా వారందరిని పిలిచి విచారించిన సిట్ సిరిసిల్ల పోయి ఎందుకు విచారణ చేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. పరీక్షలు నిర్వహించలేక పోతే తప్పుకోవాలని సీఎంకు సూచించారు. కేంద్రంలో మోదీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఇలాంటి వార్తలు ఏమైనా వస్తున్నాయా అన్నారు. ముఖ్యమంత్రి లక్షల కోట్లు తింటే నేనెందుకు తినొద్దు అన్న యోచనతో అంటెంఢర్ వరకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జి‌తో విచారణ అంటే సీఎం కేసీఆర్ గజగజా వణుకుతున్నారని విమర్శించారు. తీగలాగితే డొంక కదిలినట్టు మూలాలు అన్ని ప్రగతి భవన్‌కు వెళ్తుందని భయపడుతున్నారని అన్నారు. బెల్టుషాపులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతుందని చెప్పారు. టీఎస్పీఎస్సీ కమిటీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీలను ఏడాది లోపు భర్తీ చేస్తామన్నారు. ఆ తరువాత ఏడాది నుంచి బాజ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు.

Updated Date - 2023-04-04T21:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising