ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ‘రాహుల్‌పై కేసు వేసింది ఎవరో తెలుసా?’

ABN, First Publish Date - 2023-03-26T21:38:44+05:30

అదానీ పోర్టు ద్వారా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

హైదరాబాద్: అదానీ పోర్టు ద్వారా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. దేశ యువతను మత్తులో ముంచాలని బ్రిటిష్ జనతా పార్టీ చూస్తుందని మండిపడ్డారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ మాట్లాడితే... గుజరాత్‌లో కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు వేసింది బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో పాదయాత్రకు వచ్చిన ఆదరణ చూడలేకనే రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. అదాని వ్యాపార సంస్థల ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకుంటుందని రేవంత్ ఆరోపించారు. అదాని కంపెనీ తన షేర్లను కృత్రిమంగా పెంచి దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో హిడెన్ బర్గ్ రిపోర్ట్ చెప్పిందన్నారు. అదానికి ఆదాయం ఎలా పెరిగింది? అని ఆయన ప్రశ్నించారు.

మోడీ, అదాని బండారాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో బయట పెట్టారని చెప్పారు. రాహుల్ గాంధీని చూడాలంటే మోడీ భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు నిజాయితీ పరుల ముసుగులో దేశాన్ని కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రజాప్రతినిధులపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ అంటే...అదానీ... ప్రధాని అని అర్ధమన్నారు. ఆదానీ ఇంజన్‌కు రిపేర్ రావడంతో ప్రధాని ఇంజన్‌కు భయం పట్టుకుందన్నారు.

Updated Date - 2023-03-26T21:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising