ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RTC: నెలవారీ బస్‌పాస్‌ దారులకు టీఎస్‌ఆర్టీసీ తీపికబురు

ABN, First Publish Date - 2023-04-03T18:16:43+05:30

రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్‌ దారులకు తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) (TSRTC) శుభవార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారిత నెలవారీ బస్‌పాస్‌లు

శ్లాబ్‌ విధానం ఎత్తివేత.. ఇక బస్‌ పాస్‌లోనే టోల్‌ రుసుం

హైదరాబాద్: రాష్ట్రంలోని నెలవారీ బస్‌పాస్‌ దారులకు తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) (TSRTC) శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసింది. అంతేకాదు, టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఐపీఎస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్‌ దారులకు టోల్‌ప్లాజా రుసుం వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌ పాస్‌ చూపించి.. ప్రతి రోజూ టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. ఇక టోల్‌రుసుంతో పాటే నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేయనుంది.

తెలంగాణలో ప్రస్తుతం 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి 'మంత్లీ సీజన్‌ టికెట్‌' పేరుతో పాస్‌లను సంస్థ ఇస్తోంది. నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఈ పాస్‌లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ పాస్‌ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని సంస్థ ఇస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.

''ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నెలవారీ బస్‌పాస్‌ల్లో గతంలో శ్లాబ్‌ విధానం అమల్లో ఉండేది. ఉదాహరణకు.. ఒకరు 51 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్లాబ్‌ విధానం ద్వారా 55 కిలోమీటర్లకు నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేసేది. ఇకమీదట 51 కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, టోల్‌ప్లాజా రుసుం కూడా బస్‌పాస్‌లోనే ఉండనుంది. ఈ నిర్ణయం నెలవారీ బస్‌దారులకు ఎంతో మేలు చేస్తుంది." అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు తెలిపారు. ఈ సదుపాయాన్ని రెగ్యులర్‌ ప్రయాణికులు వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ సూచించింది.

Updated Date - 2023-04-03T18:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising