ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nikhat Zareen: సీఎం కేసీఆర్‎కి థ్యాంక్స్..మా అమ్మ రింగ్‎లో గేమ్ ఆడటం తొలిసారి చూసింది..

ABN, First Publish Date - 2023-04-01T12:11:31+05:30

ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‎షిప్(Women's World Boxing Championship) గోల్డ్ మెడల్(Gold Medal) సాధించిన నిఖత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‎షిప్(Women's World Boxing Championship) గోల్డ్ మెడల్(Gold Medal) సాధించిన నిఖత్ జరీన్(Nikhat Zareen) హైదరాబాద్ చేరుకుంది. వియత్నాం బాక్సర్ తై టామ్‌ (thi tam) (Nguyen Thi Tam)పై గెలిచి రెండోసారి వరల్డ్ ఛాంపియన్‎గా నిలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చేరుకున్న నికత్ జరీన్‎కు మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ (Nikhat Zareen) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ జరీన్ హోమ్ ల్యాండ్‎లో ఆడటం అనేది కొంచెం ఛాలెంజింగ్‎గా ఉంటుంది. కానీ..అందరి నుంచి వచ్చిన సపోర్ట్‎తో చాలా మోటివేషన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)నుంచి సపోర్ట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‎కి(CM KCR) ధన్యవాదాలు. ఆట మొదలయ్యే ముందు కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రత్యర్థి మీదే ఉంటుంది. వియత్నాం క్రీడాకారిణి మీద ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యాను. 2019లో తనతో ఆడిన మ్యాచ్‎లో మొదటిసారి ఓడిపోయాను. రింగ్‎లోకి వెళ్లే ముందు మా నాన్నతో ఫోన్‎లో మాట్లాడాను. మొదటిసారి మా అమ్మ రింగ్‎లో గేమ్ ఆడటం చూసింది’’ అని తెలిపింది.

తెలంగాణ స్థానాన్ని చిరస్థాయిగా నిలిపింది..

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) మాట్లాడుతూ..‘‘నికత్ జరీన్‎కు ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ ముద్దుబిడ్డ ప్రపంచ పటంలో తెలంగాణ స్థానాన్ని చిరస్థాయిగా నిలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో సీఎం కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ప్రభుత్వపరంగా బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయటానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాము. బాక్సింగ్‎కి హైదరాబాద్ హోమ్ టౌన్‎గా కావాలని ఆశిస్తున్నాము. నిఖత్ జరీన్‎కి కేసిఆర్ డీసీపీ ఉద్యోగం ఇస్తున్నారు.యువత ప్రస్తుతం పక్కదోవ పడుతోంది. ఇలాంటి వారికి నికత్ జరీన్ ఒక మంచి ఉదాహరణగా నిలవాలని’’ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Updated Date - 2023-04-01T12:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising