TS NEWS: కార్లు అద్దెకు తీసుకెళ్తాడు.. ఆ తర్వాత ఏం చేస్తాడంటే.. ఆ నేరగాడికి చెక్ పెట్టిన పోలీసులు
ABN, First Publish Date - 2023-09-05T19:16:40+05:30
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కార్లను దొంగిలిస్తున్న(Selling cars) ఓ నిందితుడిని పట్టుకున్నారు.
హైదరాబాద్: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కార్లను దొంగిలిస్తున్న(Selling cars) ఓ నిందితుడిని పట్టుకున్నారు. ఈ రోజు చంద్రాయనగుట్ట Chandrayanagutta) క్రాస్ రోడ్(వద్ద నిందితుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే చంద్రాయనగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు అక్కడే ఉండండతో మాటు వేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి కోటి ఇరవై లక్షల రూపాయల విలువగల 8 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్‌కు(Sanatnagar) చెందిన మహ్మద్ అస్లాం నవాజ్(Mohammad Aslam Nawaz) అనే వ్యక్తి సనత్‌నగర్ ప్రాంతంలో అద్దె కార్ల వ్యాపారం నిర్వహించేవాడు. వివిధ కార్లను యజమానుల దగ్గరి నుంచి అద్దెకు తీసుకొనేవాడు. యజమానులకు నమ్మకం కలిగేలా మొదటగా కార్లకు మూడు నెలలు అద్దె చెల్లించి నమ్మకస్తుడిగా నటించాడు. కొద్ది రోజులుగా యజామానులకు అద్దె చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అద్దె అడిగితే రేపు మాపాంటూ కాలాయాపన చేయడంతో కార్ల యజమానులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నిందితుడిపై నిఘా పెట్టారు. కార్ల యజమానులను నమ్మించి ఆ కార్లను తీసుకున్న తర్వాత వేరే రాష్ట్రాల్లో 3 నుంచి 4 లక్షలకు అమ్మేవాడు. గతంలో కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన కార్లను అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. యజమానులు తమ కార్ల గురించి అడగ్గా వేరే రాష్ట్రాలకు పారిపోయేవాడని, ఇలా గతంలో కూడా చేసి జైల్‌కు వెళ్లినట్లు చంద్రాయనగుట్ట పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-09-05T19:17:51+05:30 IST