TS GOVT: కొవిడ్-19పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ABN, Publish Date - Dec 18 , 2023 | 09:53 PM
పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 ( Covid-19 ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా మరియు అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 ( Covid-19 ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా మరియు అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలి. అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు. అవసరమైన ప్రజారోగ్య చర్యలు మరియు ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, తగినన్ని వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
Updated Date - Dec 19 , 2023 | 04:26 PM