ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TPCC Chief: కేసీఆర్‌ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందన్న రేవంత్

ABN, First Publish Date - 2023-11-02T13:38:12+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాళేశ్వరం కర్రెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప ఏంటనేది తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఎల్ అండ్ టీ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.


సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందన్నారు. గుడినీ గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాపం పండింది... కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగిందంటూ విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరయిందన్నారు. బీఆర్‌ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ అవినీతికి ప్రాజెక్టు బలైందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే.. కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు బలి తీసుకుంటుందన్నారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్‌ఎస్‌కు స్పష్టత వచ్చిందని తెలిపారు. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నా అది జరగదన్నారు. తమరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని.... కేసీఆర్‌ను పడగొడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-02T13:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising