ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth: పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు

ABN, First Publish Date - 2023-10-18T14:39:42+05:30

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

హైదరాబాద్: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి (Former MLA Revanthreddy) కాంగ్రెస్‌లో (Congress) చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy).. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని.. వారిని మనస్పూర్తిగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడంలో నియోజకవర్గ ప్రజల శ్రమ ఉందన్నారు. ‘‘పాలు అమ్ముకునే వాడొకడు సీట్లు అమ్ముకునేవాడొకడు. మామ, అల్లుళ్లకు బుద్ది చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారు. ఇక్కడి ప్రజలకు ఈ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నా. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పించే బాధ్యత మాది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా మారుస్తాం. మెట్రో రైలును ఈ ప్రాంతానికి పొడగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సుధీర్ రెడ్డికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తాం. టికెట్ రానివారి ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను. ఎవరిపై మాకు ద్వేషం లేదు అందరినీ కలుపుకుని పనిచేయాలి. ముందున్న లక్ష్యాన్ని చూడండి. కార్యకర్తల కష్టాలు చూడండి. కాంగ్రెస్‌ను గెలిపించండి’’ అంటూ రేవంత్ కోరారు.

Updated Date - 2023-10-18T14:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising