Revanth Reddy: రాహుల్ టీషర్ట్‌పై బీజేపీవి చిల్లర రాజకీయాలు
ABN, First Publish Date - 2023-01-21T13:08:53+05:30
రాహుల్ గాంధీ టీ షర్ట్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రాహుల్ గాంధీ టీ షర్ట్ (Rahul Gandhi T-shirt)పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్ర (Rahul Gandhi Padayatra) తో బీజేపీలో భయం మొదలైందన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ పాదయాత్ర జనవరి 26న శ్రీనగర్‌లో ముగియాల్సిన ఉందని.. నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కుట్రతో నాలుగు రోజులు ఆలస్యంగా జనవరి 30న పాదయాత్ర ముగిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-01-21T13:08:54+05:30 IST