ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dimple Hayathi.. నటి డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీ కొట్టింది: డీసీపీ

ABN, First Publish Date - 2023-05-23T11:40:11+05:30

హైదరాబాద్: నటి డింపుల్ హయతి తన అధికారిక వాహనాన్ని ఢీ కొట్టిందని, ఆమె, తాను ఒకే అపార్ట్ మెంట్‌లొనే ఉంటున్నామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నటి డింపుల్ హయతి (Dimple Hayathi) తన అధికారిక వాహనాన్ని ఢీ కొట్టిందని, ఆమె, తాను ఒకే అపార్ట్ మెంట్‌లొనే ఉంటున్నామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (Traffic DCP Rahul Hegde) చెప్పారు. ఈ ఘటనపై ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ తాను పార్క్ చేసే స్థలంలో తన కారుకు ఆమె అడ్డు పెడుతుందని, తాను పోలీస్ కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో తన అధికారిక వాహనానికి అడ్డుపెట్టి ఇబ్బంది పెడుతుందని, తన వాహనాన్ని ఢీ కొట్టి ఆపై కాలుతో తన్నిందన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయన్నారు. అయితే తాను వ్యక్తిగతంగా వెళ్లి డింపుల్ హయతిని రిక్వెస్ట్ చేశానన్నారు. అయినా ఆమె తీరు మారకపోవడంతో తన డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పును కప్పి పుచ్చినట్లు ఆమె ట్విట్ చేసిందని, తనకు, డింపుల్‌కు వ్యక్తి గత గొడవలు ఏమి లేవన్నారు. ఆమె ఆరోపణలపై పోలీస్ విచారణలో అన్ని విషయాలు బయట పడతాయని రాహుల్ హెగ్డే అన్నారు. కాగా ఈ వార్త మీడియాలో వచ్చిన 10 నిమిషాల్లో డింపుల్ తన వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలానాలను క్లియర్ చేశారు.

ఐపీఎస్ అధికారితో టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి గొడవకు దిగింది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టింది. ఆపై రుబాబు ప్రదర్శిస్తూ కాలితో తన్నింది. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్‌లో నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ పార్కింగ్ ప్లేస్‌లో ఢీ కొట్టాడు. అదేంటని రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ ప్రశ్నించగా.. కారును కాలితో తంతూ నానా రచ్చ చేసింది. దీనిపై రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-05-23T11:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising