TSPSC: ప్రశ్నపత్రాలు ఎలా లీక్ చేశారు?
ABN, First Publish Date - 2023-03-20T01:42:04+05:30
టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నిందితులను రెండో రోజు ఆదివారం సిట్ బృందంతో పాటు సైబర్ క్రైం పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తిగా టెక్నికల్ అంశాలపై జరిగినట్లు తెలిసింది.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ సిటీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నిందితులను రెండో రోజు ఆదివారం సిట్ బృందంతో పాటు సైబర్ క్రైం పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తిగా టెక్నికల్ అంశాలపై జరిగినట్లు తెలిసింది. నిందితులు ప్రశ్నాపత్రాలను ఎలా లీక్ చేశారో సాంకేతికంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. వారు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుని, వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి ఎలా, ఎవరి అనుమతితో వెళ్లేవారు, అక్కడి నుంచి ప్రశ్నపత్రాలు ఎలా తీసుకోగలిగారనే కోణంలోనూ విచారించారు. రాజశేఖర్‌కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఎంతకాలంగా నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు, టీఎస్‌పీఎస్సీలోని కంప్యూటర్లపై అతడికి తెలిసిన సమాచారం తదితర అంశాలపై ప్రశ్నించారు.
రాజశేఖర్, ప్రవీణ్‌లకు టీఎస్‌పీఎస్సీలో ఉన్న కంప్యూటర్ల ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా తెలిశాయి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని శంకరలక్ష్మి కంప్యూటర్ ఐపీ అడ్ర్‌సను ఎలా మార్చగలిగారు, అందులో ఉన్న సమాచారాన్ని పెన్ డ్రైవ్‌లోకి ఎలా పంపారు, శంకరలక్ష్మికి అనుమానం రాకుండా కంప్యూటర్‌ను ఎలా కంట్రోల్ చేయగలిగారనే సాంకేతిక అంశాలపై విచారణ చేశారు. పేపర్ లీకేజీలో ఇతరుల ప్రమేయంపైనా ప్రశ్నించారు. ఇతరులకు అనుమానం రాకుండా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎలా తీసుకోగలిగారు. వాటి సాయంతో ఇంకా ఎన్ని ప్రశ్నపత్రాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్‌తో పాటు ఇతర నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు, వారి కాల్‌డాటాపై దృష్టి పెట్టారు. ఆ ఫోన్లలో ఉన్న కాంటాక్టుల గురించి ఆరా తీస్తున్నారు. వారిలో ఎవరైనా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు రాశారా, రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం క్రోడీకరించిన తర్వాత మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించిన సైబర్ క్రైం పోలీసులు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నిందితులను రెండో రోజు ఆదివారం సిట్ బృందంతో పాటు సైబర్ క్రైం పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తిగా టెక్నికల్ అంశాలపై జరిగినట్లు తెలిసింది. నిందితులు ప్రశ్నాపత్రాలను ఎలా లీక్ చేశారో సాంకేతికంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. వారు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుని, వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ టీఎ్‌సపీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి ఎలా, ఎవరి అనుమతితో వెళ్లేవారు, అక్కడి నుంచి ప్రశ్నపత్రాలు ఎలా తీసుకోగలిగారనే కోణంలోనూ విచారించారు. రాజశేఖర్‌కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఎంతకాలంగా నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు, టీఎ్‌సపీస్సీలోని కంప్యూటర్లపై అతడికి తెలిసిన సమాచారం తదితర అంశాలపై ప్రశ్నించారు. రాజశేఖర్, ప్రవీణ్‌లకు టీఎస్‌పీఎస్సీలో ఉన్న కంప్యూటర్ల ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా తెలిశాయి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని శంకరలక్ష్మి కంప్యూటర్ ఐపీ అడ్ర్‌సను ఎలా మార్చగలిగారు, అందులో ఉన్న సమాచారాన్ని పెన్ డ్రైవ్‌లోకి ఎలా పంపారు, శంకరలక్ష్మికి అనుమానం రాకుండా కంప్యూటర్‌ను ఎలా కంట్రోల్ చేయగలిగారనే సాంకేతిక అంశాలపై విచారణ చేశారు.
పేపర్ లీకేజీలో ఇతరుల ప్రమేయంపైనా ప్రశ్నించారు. ఇతరులకు అనుమానం రాకుండా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎలా తీసుకోగలిగారు. వాటి సాయంతో ఇంకా ఎన్ని ప్రశ్నపత్రాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్‌తో పాటు ఇతర నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు, వారి కాల్‌డాటాపై దృష్టి పెట్టారు. ఆ ఫోన్లలో ఉన్న కాంటాక్టుల గురించి ఆరా తీస్తున్నారు. వారిలో ఎవరైనా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు రాశారా, రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం క్రోడీకరించిన తర్వాత మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రూప్-1 పరీక్ష రాయలేదు: ప్రవీణ్
లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన ప్రవీణ్ తాను గ్రూప్-1 పరీక్ష రాయలేదని విచారణలో సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రవీణ్ అరెస్టయిన అనంతరం సోషల్ మీడియాలో అతను రాసినదంటూ ప్రత్యక్షమైన గ్రూప్-1 పరీక్ష ఓఎంఆర్ షీట్ ఎవరిదన్న కోణంలో సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అతనికి పరీక్షలో 103 మార్కులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు? అసలు ప్రవీణ్ నిజం చెబుతున్నాడా? లేక ఎవరైనా ఇలా చెప్పిస్తున్నారా? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన ప్రవీణ్ తాను గ్రూప్-1 పరీక్ష రాయలేదని విచారణలో సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రవీణ్ అరెస్టయిన అనంతరం సోషల్ మీడియాలో అతను రాసినదంటూ ప్రత్యక్షమైన గ్రూప్-1 పరీక్ష ఓఎంఆర్ షీట్ ఎవరిదన్న కోణంలో సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అతనికి పరీక్షలో 103 మార్కులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు? అసలు ప్రవీణ్ నిజం చెబుతున్నాడా? లేక ఎవరైనా ఇలా చెప్పిస్తున్నారా? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Updated Date - 2023-03-20T02:03:29+05:30 IST