ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC: విజయవాడ-హైదరాబాద్ హైవేపై ప్రయాణించేవారికి టీఎస్‌ఆర్టీసీ అలర్ట్!

ABN, First Publish Date - 2023-07-28T17:30:16+05:30

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) రద్దు చేసింది.

హైదరాబాద్: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికుల కోసం టీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్‌ సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని తెలిపింది.

ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని ఆ సంస్థ తెలిపింది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుందని.. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేసింది. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-07-28T18:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising