Telangana BJP: తెలంగాణ బీజేపీలో టెన్షన్ పుట్టిస్తోన్న అమిత్ షా పర్యటన... మౌనంగా ఈటల.. బీజేపీలో జోరుగా చర్చ
ABN, First Publish Date - 2023-06-13T14:11:23+05:30
తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. ఖమ్మం జిల్లా వేదికగా ఈనెల 15న బీజేపీ అగ్రనేత అమిత్ షా బహిరంగ జరుగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అమిత్ షా పాల్గొననున్న తొలి సభ ఇది.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit shah)పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. ఖమ్మం జిల్లా వేదికగా ఈనెల 15న బీజేపీ అగ్రనేత అమిత్ షా బహిరంగ జరుగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అమిత్ షా పాల్గొననున్న తొలి సభ ఇది. ఖమ్మం సభ కంటే ముందే శంషాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలతో (Telangana BJP Leaders) అమిత్ షా సమావేశంకానున్నారు. టీ బీజేపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలపై అగ్రనేత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తీరు మార్చుకోవాలని టీ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా ఏమంటారో అనే టెన్షన్ తెలంగాణ బీజేపీ నేతల్లో నెలకొంది. తెలంగాణ బీజేపీని కేంద్రమంత్రి ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు.
ఎన్టీఆర్ నామస్మరణం...
మరోవైపు అమిత్ షా టూర్ నేపథ్యంలో బీజేపీ ఎన్టీఆర్ నామస్మరణం చేస్తోంది. ఖమ్మం సభలో ప్రసంగించే ముందు ఎన్టీఆర్ విగ్రహానికి కేంద్రమంత్రి నివాలుళర్పించనున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ పొత్తుపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అమిత్ షా టూర్ ముందు పొత్తుపై బీజేపీలో కొత్త సమీకరణాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈటల మౌనం ఎందుకో..?
మరోవైపు అమిత్ షా టూర్‌కు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) మౌనం పాటిస్తున్నారు. దీంతో ఈటల రాజేందర్ మౌనం ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మను (Assam CM Himanta Biswasharma) ఈటల కలిసొచ్చారంటూ ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈటలకు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిపై మీడియాకు లీకులు వచ్చాయి. లీకుల తర్వాత ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా సీనియర్ల మీటింగ్ నిర్వహించారు. దీంతో అప్పటినుంచి ఈటల మౌనం పాటిస్తున్నారు. అమిత్ షా పర్యటనకు ముందు ఈటల మౌనంపై బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఒక్కరోజు ముందే హైదరాబాద్‌కు అమిత్‌షా?
కాగా.. కేంద్రమంత్రి అమిత్ షా రేపు (బుధవారం) రాత్రికే హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజు ముందే బీజేపీ అగ్రనేత రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. 15న ఖమ్మం జరుగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో అమిత్ షా టూర్‌పై ఆసక్తి నెలకొంది. అధ్యక్షుడి మార్పు, ప్రచార కమిటీ చైర్మన్ ఈటలకు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-06-13T14:13:37+05:30 IST