ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti : అన్నివర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలి

ABN, First Publish Date - 2023-03-20T00:20:55+05:30

ఏ ఒక్క సామాజికవర్గానికి నేను వ్యతిరేకం కానప్పటికీ, అణచివేతకు చిరకాలంగా గురిచేయబడ్డ, అన్నివర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తినని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్(Hyderabad): ఏ ఒక్క సామాజికవర్గానికి నేను వ్యతిరేకం కానప్పటికీ, అణచివేతకు చిరకాలంగా గురిచేయబడ్డ అన్నివర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తినని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి
(Vijayashanti) అన్నారు. ఆదివారం సోషల్ మీడియా (
Social media) లో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు ఆవార్తను యథతదంగా ఇస్తున్నాం. ‘‘మలిదశ తెలంగాణ ఉద్యమం (Telangana Movement) జరుగుతున్న సమయంలో నన్ను మీడియా మిత్రులు విశాఖపట్నం(Visakhapatnam)లో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో ఒక అంశం ఇప్పటికీ ప్రస్తావనార్హంగానే ఉంది. నాటి ఉమ్మడి ఏపీ(Joint AP)లో కూడా రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాలు, రాజ్యాధికారం అంటే కూడా అంతే అనే వ్యవస్థ మారాలంటే బడుగు, బలహీన, అట్టడుగు సముదాయాల జనబాహుళ్యం తమ రాజ్యాధికార హక్కు సమంజస స్థాయిలో సాధించగలగాలంటే రెండు రాష్ట్రాలే ప్రత్యామ్నాయం. ఆ మార్పు దిశగా తెలంగాణలో బీజేపీ సమీపిస్తున్నది. ఏపీలో కూడా జనసేన, బీజేపీ (Janasena, BJP)లు, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రాజ్యాధికార అర్హతను సాకారం చేయగలిగే విజయాన్ని చేరుకుంటే, 18 సంవత్సరాల ముందు నుంచి నేను చెప్పదలుచుకుంటున్నది... చెబుతున్నది సార్ధకం అవుతున్నదని విశ్వసిస్తున్న’’ అని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-03-20T00:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising