Vinod Kumar: కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదు
ABN, First Publish Date - 2023-10-03T19:44:33+05:30
కేసీఆర్ గురించి మోడీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్( Vinod Kumar) స్పదించారు.
హైదరాబాద్: కేసీఆర్ గురించి మోడీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్( Vinod Kumar) స్పదించారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘కొవిడ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చారు... అప్పుడు కేసీఆర్‌ను మోదీనే వద్దు అన్నారు. కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదు. GHMC ఎన్నికలకు మోదీ పర్యటనకు ఏం సంబంధం. కేసీఆర్ గురించి మోదీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? మోదీ జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితం అయింది. మోదీకి తెలంగాణ, తమిళనాడు, కేరళ అంటే కూడా ఇష్టం లేదు. కేసీఆర్‌పై మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని వినోద్ కుమార్ మండిపడ్డారు.
Updated Date - 2023-10-03T19:44:33+05:30 IST