kothprabhakar Health: కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యంపై యశోదా వైద్యుల మాటల్లో...
ABN, First Publish Date - 2023-10-31T14:32:40+05:30
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై (Medak MP Kotha Prabhakar reddy) గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని యశోద వైద్యులు మీడియాకు వివరించారు. యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ... నాలుగు గంటల ఆపరేషన్ అనంతరం.. పోస్ట్ ఆపరేటివ్ కోసం ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూకి షిఫ్ట్ చేశామని తెలిపారు. బీపీ సాధారణంగా మెయింటైన్ అవుతుందని.. ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడిందని చెప్పడానికి లేదన్నారు. అందుకే ఐసీయూలోనే ఇంకో నాలుగు రోజులు ట్రీట్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు.
డాక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ...
కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అన్ని వైటల్స్ నార్మల్‌గా ఉన్నాయని.. కాన్సియస్‌గా ఉన్నారని తెలిపారు. రికవరీ ప్రాసెస్ గురించి ఆయనకి వివరించినట్లు చెప్పారు. యాంటీ బయోటిక్స్ ఇస్తున్నామన్నారు. ఒక వారం రోజులు రెస్ట్ అయితే అవసరమన్నారు. ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు ఉన్నాయని... అందుకే ప్రతిరోజూ అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. పదిహేను రోజులు తరువాత స్టిచ్చేస్ తీస్తామన్నారు. ఇది మేజర్ సర్జరీ గానే చెప్పొచ్చన్నారు. రికవరీకి కొంత సమయం పడుతుందని తెలిపారు. చిన్న గాటు లాగే ఉంటుందని... కానీ లోపల పేగుల దగ్గర పెద్ద కత్తి పోటు కాబట్టి కొంత సమయం పడుతుందని వివరించారు.
Updated Date - 2023-10-31T14:32:40+05:30 IST