ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YC Sharmila: కేసీఆర్ దొర మాట్లాడుతుంటే... దొంగలే భుజాలు తడుముకున్నట్లుంది

ABN, First Publish Date - 2023-06-07T13:17:16+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’’ అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ప్రశ్నించారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’’ అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ప్రశ్నించారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని నిలదీశారు. 3 కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఉద్యమ ఆకాంక్షను నమ్మి చేతుల్లో పెడితే నట్టేట ముంచిన దోపిడీ దొంగలు మీరే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నీళ్లు అని చెప్పి ఫామ్ హౌజ్‌కు, నిధులని చెప్పి మీ ఖజానాకు, ఉద్యోగాలు అని చెప్పి మీ కుటుంబానికి ఎత్తుకుపోయిన మోసగాళ్లు మీరే కదా. బంగారు తునక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి ఆ సొమ్ముతో దేశ రాజకీయాలు చేసే మీరే ఈ శతాబ్దపు అసలైన దళారులు. బడి నుంచి సాగుబడి వరకు అన్ని ప్రాజెక్టులపై లక్ష కోట్ల కమీషన్లు తిన్న దోపిడీ దారులు మీరే. పార్టీ కార్యాలయాలకు, అయినోల్లకు అగ్గువకే 30 వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టిన మీ పాలన దళారి పాలన. దొర గుడిని మింగితే ఆయన ఎమ్మెల్యేలు లింగాలనే మింగే దళారులు. కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5 లక్షలు, దళితబంధులో 3 లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు 3 లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30% కమీషన్లు... ఇసుక,మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకుతింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుని తిరుగుతూ... ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట, గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్. ఒకప్పుడు గంజి కేంద్రాలు ఏమో కానీ మీ నియంత పాలనలో గల్లికొక లిక్కర్ కేంద్రాలే మిగిలినయ్. రైతు రాజ్యం ఉందని..దొరల రాజ్యం నడుపుతూ, వెలుగుజిలుగులు వచ్చాయని.. అంధకారంలోకి నెట్టిన మీ దళారి పాలనను బొంద పెట్టే గడియలు దగ్గరపడ్డాయి’’ అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-07T13:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising