ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: 19 రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

ABN, First Publish Date - 2023-05-30T19:32:27+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు భక్తుల నుంచి 19 రోజుల్లో రూ.2.28కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయ ఖజానాకు భక్తుల నుంచి 19 రోజుల్లో రూ.2.28కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. ఈ నెల 11నుంచి 29వ తేదీవరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు (Devotees) హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.2,28,25,714 నగదు, 95 గ్రాముల మిశ్రమ బంగారం, 3.700కిలోల మిశ్రమ వెండి ఆలయ ఖజానాలో జమచేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. 657 అమెరికా డాలర్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 15 కెనడా డాలర్లు, 12 సింగపూర్‌ డాలర్లు (Singapore dollars), 40 సింగపూర్‌ దిన్హార్స్‌, 57మలేషియా రింగెట్స్‌, 400 ఓమన్‌ భైసాలు, 10 బహ్రైన్‌ దిన్హార్స్‌, 20కతార్‌ రియాల్స్‌, 20 యూరోప్‌ యూరల్స్‌ విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో సమర్పించారని తెలిపారు. సత్యనారాయణస్వామి మండపంలో నిర్వహించిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - 2023-05-30T19:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising